స్పోటీఫై లైబ్రరీలో న్యూ ‘డైనమిక్ ఫిల్టర్స్’

by Sujitha Rachapalli |
స్పోటీఫై లైబ్రరీలో న్యూ ‘డైనమిక్ ఫిల్టర్స్’
X

దిశ, ఫీచర్స్ : సంగీత ప్రేమికులను అలరిస్తూనే చిట్టిపొట్టి ఆడియో బైట్స్ అందించే ‘స్పోటిఫై’ ప్లాట్‌ఫామ్ తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు న్యూ ఫీచర్స్‌తో పాటు రీడిజైన్డ్ వెర్షన్స్ అందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ‘మ్యూజిక్ లైబ్రరీ’కి పిన్ కంటెట్, డైనమిక్ ఫిల్టర్స్, గ్రిడ్ వ్యూ వంటి సరికొత్త ఫీచర్స్‌ను యాడ్ చేసింది.

వినియోగదారులు తమ లైబ్రరీని ఈజీగా నిర్వహించుకోవడంతో పాటు సేవ్ చేసిన పాడ్‌కాస్ట్‌లు, సంగీతాన్ని వేగంగా కనుగొనేందుకు ఆల్‌కైండ్స్ ఆఫ్ స్పోటిఫై వినియోగదారులకు ‘యువర్స్ లైబ్రరీ’ న్యూ వెర్షన్‌ను విడుదల చేస్తున్నట్లు ఈ స్ట్రీమింగ్ సర్వీస్(స్పోటీఫై) తాజాగా తెలిపింది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఇవి రోల్ అవుట్ అవుతాయని పేర్కొంది.

రోజుకు పదుల సంఖ్యలో కొత్త పాటలు విడుదలవుతుండగా, పాత పాటల లిస్ట్‌లోనూ సంగీతాభిమానులకు నచ్చే పాటలు బోలెడన్ని ఉంటాయి. కాగా స్పోటీఫై తీసుకురాబోయే న్యూ ఫీచర్‌‌తో ఆ లిస్ట్‌ను ఆల్బమ్, ఆర్టిస్ట్, ప్లేజాబితా లేదా పొడ్‌కాస్ట్‌ వంటి డైనమిక్ ఫిల్టర్స్‌తో ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రీమియం వినియోగదారులు తాము డౌన్‌లోడ్, సేవ్ చేసిన ట్రాక్స్ కోసం ‘డౌన్‌లోడెడ్’ ఫిల్టర్ ట్యాప్ చేస్తే చాలు. వీటితో పాటు లైబ్రరీలోని ట్రాక్‌లను ఆల్ఫాబెటికల్ ఆర్డర్, క్రియేటర్ నేమ్, రీసెంట్లీ ప్లేయెడ్ జాబితాలో చూసుకునేందుకు కొత్త సార్టింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

మొబైల్ యాప్‌లో వచ్చే మరో ముఖ్యమైన ఫీచర్ ‘పిన్’. ఇమీడియేట్ యాక్సెస్ కోసం యువర్ లైబ్రరీ పైభాగంలో చాట్‌లను ‘పిన్’ చేసుకోవచ్చు. స్పోటిఫై సాధారణంగా రీసెంట్లీ ప్లే జాబితాను చూపిస్తుంది. కానీ న్యూ ఫీచర్ ప్రకారం ఒకేసారి 4 ప్లే లిస్ట్‌లు, ఆల్బమ్స్ లేదా పాడ్‌కాస్ట్‌లను కూడా పిన్ చేయవచ్చు. వినియోగదారులు తమ లైబ్రరీలోని ఏదైనా ఐటెమ్ కుడివైపు స్వైప్ చేసి, ‘పిన్’ ఎంపికను నొక్కితే చాలు అది లిస్ట్‌లో చేరిపోతుంది. ఈ ఫీచర్ వచ్చే వారంలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని స్పోటిఫై తన బ్లాగులో తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed