- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులపై స్పందించిన జహీర్ ఖాన్.. గంభీర్‌పై కీలక వ్యాఖ్యలు

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బ్యాటింగ్ ఆర్డర్‌లో చేస్తున్న మార్పులపై భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జహీర్.. ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో చేస్తున్న మార్పులపై స్పందించాడు. ఫ్లెక్స్‌బిలిటీ పేరుతో చేసే మార్పులు జట్టులో అభద్రతను సృష్టిస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫ్లెక్సిబిలిటీ ముఖ్యమే కానీ, జట్టులో స్థిరత్వం తీసుకొచ్చేలా కచ్చితమైన మార్గదర్శకాలతో తీసుకరావాలన్నాడు. ‘ఫ్లెక్స్‌బిలిటీకి కొన్ని రూల్స్ ఉన్నాయి. మీరు ప్రొటోకాల్స్‌ను ఫాలో కావాలి. కొన్ని చర్చలు జరగాలి. లేదంటే ఆటగాళ్లలో అభద్రత కలుగుతుంది. ఏదో ఒక దశలో మిమ్మల్నే ఇబ్బందిపెడుతుంది.’ అని చెప్పాడు. గంభీర్ వ్యూహాలు పనిచేయాలంటే కోచ్, కెప్టెన్, సెలెక్టర్లు, ఆటగాళ్ల మధ్య పూర్తి స్పష్టత ఉండాలన్నాడు. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో పలు మార్పులు చేసింది. తొలి వన్డేలో గిల్‌ను 3వ స్థానంలో బ్యాటింగ్‌కు దించింది. అలాగే, టాపార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను 6వ స్థానంలో ఆడిస్తున్నది. ఇక, లోయర్ ఆర్డర్‌లో వచ్చే అక్షర్ పటేల్‌ను 5వ స్థానానికి ప్రమోషన్ ఇచ్చింది.