- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదృష్టం వల్ల బతికిపోయా.. లేదంటే యువీ 7 సిక్స్‌లు కొట్టేవాడు : Stuart Broad
దిశ, స్పోర్ట్స్ : 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ కొట్టిన ఆరు సిక్స్‌లను క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. ఆ విధ్వంసానికి గురువారంతో 17 ఏళ్లు. ఈ నేపథ్యంలో తాజాగా బ్రాడ్ స్పందించాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో కామెంటేటర్‌గా వ్యవహరించిన అతను.. యువీ విధ్వంసాన్ని గుర్తు చేసుకున్నాడు.
అప్పుడు యువీ జోరు చూస్తే ఏడో సిక్స్ కూడా కొట్టేవాడనిపించిందని చెప్పాడు. ‘ఆ వీడియోను నేనెప్పుడు తిరిగి చూసుకోలేదు. ఆ ఓవర్‌లోనే నో బాల్ పడి ఉంటే యువీ ఏడో సిక్స్ కూడా కొట్టేవాడు. నా అదృష్టం కొద్ది నో బాల్ పడలేదు. ఇది కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే.’ అని చెప్పుకొచ్చాడు.
కాగా, ధోనీ నేతృత్వంలో టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సూపర్-8 దశలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన యువరాజ్ 16 బంతుల్లోనే 58 రన్స్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్రాడ్ వేసిన 19వ ఓవర్‌లో యువీ వరుసగా ఆరు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 18 పరుగుల తేడాతో గెలిచింది.