- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Yuvraj Singh: అభిషేక్ శర్మ వీరోచిత సెంచరీ.. యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లో భాగంగా ముంబై (Mumbai)లోని వాంఖడే స్టేడియం (Wankhede Stadium) వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా (Team India) అదరగొట్టింది. ఇంగ్లీష్ జట్టుపై ఏకంగా 150 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదుదు చేసింది. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో అభిషేక్ కేవలం 54 బంతుల్లో 135 పరుగులు చేయగా, బౌలింగ్‌లో రెండు వికెట్లను తీసుకున్నాడు. అది కూడా ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు తీయడం విశేషం. అభిషేక్ శర్మ మ్యాచ్ మొత్తం షేక్ చేసేశాడు. దీంతో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న అభిషేక్ శర్మను మెంటార్, భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మేరకు తన ‘X’ (ట్విట్టర్) వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశాడు.
‘అభిషేక్ శర్మ బాగా ఆడావు. నేను నిన్ను ఎక్కడ చూడాలనుకున్నానో ఇప్పుడు నువ్వు.. అక్కడే ఉన్నావు. నిన్ను చూసి గర్వపడుతున్నా’ అని యువరాజ్ తన పోస్టులో రాసుకొచ్చాడు. ఇప్పుడు ఆ ట్వీట్ సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు ‘యువరాజ్‌కు సమంగా అభిషేక్ ఏమాత్రం తీసిపోడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతకు ముందు అభిషేక్ శర్మ ఇదే సిరీస్ తొలి మ్యాచులో 34 బంతుల్లో 79 పరుగులు చేసినప్పుడు కూడా యువీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ‘సిరీస్ లో కుర్రాళ్లకు శుభారంభం..! మా బౌలర్లు అద్భుతంగా ఆడారు. స్టార్ అభిషేక్ శర్మ (Abhishek Sharma), టాప్ నాక్! మీరు గ్రౌండ్‌లో కూడా రెండు బౌండరీలు కొట్టడం నన్ను ఆకట్టుకుంది’ అని యువరాజ్ పోస్ట్ చేశాడు. కాగా, నిన్న జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, 37 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. దీంతో భారత జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 247 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్ 97 పరుగుకు ఆలౌట్ అయింది. ఫలితంగా టీమిండియా 150 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.