Yograj Singh: యువరాజ్ సింగ్ చనిపోయినా.. గర్వపడేవాడిని: తండ్రి సెన్సేషనల్ కామెంట్స్

by Shiva |   ( Updated:2025-01-13 09:35:24.0  )
Yograj Singh: యువరాజ్ సింగ్ చనిపోయినా.. గర్వపడేవాడిని: తండ్రి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యువరాజ్ సింగ్ (Yuvaraj Singh) ఇండియన్ క్రికెట్ హిస్టరీలో మరిచిపోలేని పేరు. అన్ని ఫార్మాట్లలో రికార్డులు అతడి సొంతం. భారత జట్టు (Team India) 2011 వన్డే ప్రపంచ కప్‌ (One Day World Cup) సాధించడంలో అతడి పాత్ర అనన్య సామాన్యం. ఓ వైపు క్యాన్సర్‌ (Cancer)తో పోరాడుతూనే బ్లడ్ వాంటింగ్స్ (Blood Wantings) చేసుకుంటూ వెస్టిండీస్‌తో మ్యాచ్‌ (West Indies)లో యూవీ ఆడిన తీరు దేశం ఎన్నటికీ మరువదు. ఈ క్రమంలోనే తాజాగా యువరాజ్ సింగ్ (Yuvaraj Singh) క్యాన్సర్‌తో పోరాడిన రోజులను తండ్రి యోగ్‌రాజ్ సింగ్ (Yograj Singh) గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టాడు.

ఒకవేళ క్యాన్సర్ చివరి దశలో ఉన్నా.. యువరాజ్ సింగ్ (Yuvaraj Singh) దేశం కోసం వన్డే ప్రపంచ కప్ ఆడుతూ మరణించినా తాను ఎంతగానో గర్వించే వాడినని భావోద్వేగానికి లోనయ్యారు. వెస్టిండీస్‌ (West Indies)తో మ్యాచ్‌ జరుగుతుండగా గ్రౌండ్‌లో రక్తపు వాంతులు చేసుకున్నాడని.. అయినా తాను ఆటను కొనసాగించాలంటూ యూవీకి ఫోన్ చేసి చెప్పానని యోగ్‌రాజ్ సింగ్ (Yograj Singh) గుర్తు చేస్తూ కంటతడి పెట్టారు. కాగా, 2011 వన్డే ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ ఆల్‌రౌండర్‌గా జట్టుకు అద్భుత విజయాలు అందించాడు. టోర్నీ మొత్తంలో నాలుగు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ‌తో 362 పరుగులు చేసి ఏకంగా 15 వికెట్లు పడగొట్టాడు.

Next Story

Most Viewed