- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పాకిస్తాన్ జట్టును ఏడాదిలో గాడిన పెడతా

- సీనియర్లు జట్టును ఎగతాళి చేయడం తగదు
- అక్రమ్, షోయబ్ అక్తర్‌లు వారి జట్టు ఏం చేస్తున్నారు?
- యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్
దిశ, స్పోర్ట్స్: నాకు ఛాన్స్ ఇస్తే ఏడాదిలోగా పాకిస్తాన్ క్రికెట్ జట్టును గాడిలో పెడతానని యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ టీమ్‌ను మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్, షోయబ్ అక్తర్ అసలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహిస్తున్నారు. ఆతిథ్య జట్టుగా ఉన్న పాకిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దుబాయ్ వేదికగా ఇండియాతో జరిగిన మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మాజీ క్రికెటర్లు కూడా దుయ్యబట్టారు. కెప్టెన్ రిజ్వాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడమే కాకుండా.. ఆటగాడిగా కూడా విఫలమయ్యాడంటూ వసీం అక్రమ్. షోయబ్ అక్తర్‌లు కామెంట్ చేశారు. పాకిస్తాన్ క్రికెటర్లు ఎలా ఆడాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలని సలహా ఇచ్చారు.
కాగా, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలపై యోగరాజ్ సింగ్ మండిపడ్డారు. 'వసీం అక్రమ్, షోయబ్ అక్తర్ వంటి సీనియర్ క్రికెటర్లు ఇలాంటి అసహ్యకరమైన మాటలు ఎలా మాట్లాడుతున్నారు? ఇవి విని వారి చుట్టుపక్కల ఉన్నవారు నవ్వుతున్నారు. ఇందుకు వీళ్లంతా సిగ్గుపడాలి. షోయబ్ అక్తర్ అంత పెద్ద ఆటగాడు అయ్యుండి.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో మీ ఆటగాళ్లను పోలుస్తున్నారు. మీరు అక్కడ (కామెంట్రీ బాక్సులో) కూర్చొని డబ్బు సంపాదిస్తున్నారు. కానీ ఎప్పుడైనా మీ దేశ క్రికెట్ టీమ్‌లో ఏం జరుగుతుందో పట్టించుకున్నారా? మీ టీమ్ వద్దకు వెళ్లి ఒక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించండి. మీలో ఎవరు గొప్ప పాకిస్తాన్ క్రికెటరో నేను చూడాలని అనుకుంటున్నాను. లేకపోతే రాజీనామా చేయండి' అని యోగరాజ్ వ్యాఖ్యానించారు. నేను పాకిస్తాన్ వెళ్తే ఒక్క ఏడాదిలోనే జట్టును మెరుగుపరుస్తాను. అప్పుడు మీరందరూ నన్ను గుర్తుంచుకుంటారని యోగరాజ్ చెప్పారు.