- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
యశస్వి జైశ్వాల్‌కు గాయం.. తొలి టీ20కి దూరం

దిశ, స్పోర్ట్స్ : ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా మొహాలి వేదికగా గురువారం జరుగుతున్న తొలి టీ20కి టీమ్ ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ దూరమయ్యాడు. గాయం కారణంగా చివరి నిమిషంలో అతను సెలెక్షన్ అందుబాటులో లేడు. కుడి గజ్జలో నొప్పి కారణంగా జైశ్వాల్ తొలి టీ20 ఆడటం లేదని బీసీసీఐ ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్‌తో కలిసి జైశ్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ధ్రువీకరించాడు. అయితే, చివరి నిమిషంలో జైశ్వాల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో రోహిత్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. మరోవైపు, తొలి టీ20లో సంజూ శాంసన్, అవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్‌లకు భారత తుది జట్టులో చోటు దక్కలేదు. సౌతాఫ్రికాపై సెంచరీ బాదిన సంజూకు తుది జట్టులో స్థానం దక్కుతుందని అంతా భావించారు. అయితే, అతన్ని బెంచ్‌కే పరిమితం చేసిన టీమ్ మేనేజ్‌మెంట్ వికెట్ కీపర్‌గా జితేశ్ శర్మను తీసుకుంది.