WPL 2023: యూపీ వారియర్స్ 10 వికెట్ల భారీ విజయం..

by Mahesh |
WPL 2023: యూపీ వారియర్స్ 10 వికెట్ల భారీ విజయం..
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ 2023 8వ మ్యాచ్ యూపీ వారియర్స్, బెంగళూరు మధ్య ముంబై వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుని 19.3 ఓవర్లకు ఆలౌట్ అయి 198 పరుగులు చేసింది. అనంతరం 139 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన యూపీ మహిళలు.. కేవలం 13 ఓవర్లలోనే 0 వికెట్లతో విజయాన్ని సాధించారు. దీంతో WPL లో మొట్టమొదటి 10 వికెట్ల విజయాన్ని యూపీ వారియర్స్ నమోదు చేసుకొగా.. బెంగళూరు వరుసగా నాలుగో మ్యాచ్ లో ఓటమి చెందింది. ఈ మ్యాచ్‌లో యూపీ వారియర్జ్‌కు చెందిన దేవికా వైద్య 36*(31), వారి కెప్టెన్ అలిస్సా హీలీ 96*(47) పరుగులు చేసింది.

Advertisement

Next Story