- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫికేషన్ టోర్నీలో సచిన్ శుభారంభం
దిశ, స్పోర్ట్స్ : థాయిలాండ్‌లో జరుగుతున్న వరల్డ్ ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫికేషన్ టోర్నీలో భారత బాక్సర్ సచిన్ సివాచ్ శుభారంభం చేశాడు. పురుషుల 57 కేజీల కేటగిరీలో బరిలోకి దిగిన అతను శుక్రవారం జరిగిన తొలి రౌండ్‌లో 5-0 తేడాతో న్యూజిలాండ్‌కు చెందిన అలెక్స్ ముకుకాను మట్టికరిపించాడు. సచిన్ మొదటి నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి రెండు రౌండ్లలో న్యూజిలాండ్ బాక్సర్‌పై పంచ్‌ల వర్షం కురిపించి కోలుకోకుండా చేశాడు. కచ్చితమైన పంచులతో ప్రత్యర్థిపై దాడి చేసి ఐదుగురు జడ్జిల మద్దతు పొందాడు. మంగళవారం రెండో రౌండ్‌లో తలపడనున్నాడు. అమిత్(51 కేజీలు), నరేంద్ర బెర్వాల్(92+ కేజీలు) తొలి రౌండ్‌లో బై పొందగా..అభిమన్యు(80 కేజీలు) నేడు తొలి రౌండ్‌లో క్రిస్టియన్ నికోలోవ్(బల్గేరియా)తో పోటీపడనున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ఇదే చివరి టోర్నీ. ఇప్పటి వరకు పురుషుల విభాగంలో ఒక్క బెర్త్ కూడా ఖరారు కాలేదు. మహిళల విభాగంలో నిఖత్ జరీన్(50 కేజీలు), లవ్లీనా బోర్గోహైన్(75 కేజీలు), ప్రీతి పవార్(54 కేజీలు) ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.