- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Timed Out: మాథ్యూస్ ఒక్కడే కాదు.. మరో ఆరుగురూ ‘టైమ్డ్ ఔట్’ బాధితులే.. జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో లంక వెటరన్ బ్యాటర్ ఏంజెలొ మాథ్యూస్ అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ‘టైమ్డ్ ఔట్’ అయిన బ్యాటర్‌గా నిష్క్రమించాడు. మాథ్యూస్ నిష్క్రమణతో ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో చర్చ అంతా ఈ అంశం మీదే నడుస్తోంది. మరి మాథ్యూస్ కంటే ముందు ఈ రకంగా ఔట్ అయిన వారు ఎవరైనా ఉన్నారా..? అంటే సమాధానం అవుననే చెప్పాలి.
ఏంటీ టైమ్డ్ ఔట్..?
క్రికెట్ చట్టాలు చేసే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిబంధనల ప్రకారం.. ఒక బ్యాటర్ ఔట్ అయినా లేదా రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగినా తర్వాత క్రీజులోకి వచ్చే బ్యాటర్ రెండు నిమిషాలలో బంతిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా జరగని పక్షంలో ఇన్‌కమింగ్ బ్యాటర్‌ను టైమ్డ్ ఔట్ రూల్ కింద ఔట్‌గా ప్రకటిస్తారు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో మాథ్యూస్ ఈ రూల్ కారణంగానే నిష్క్రమించాడు.
వన్డే మ్యాచ్‌లో ఓ బ్యాటర్ అవుటైనా లేదా రిటైర్డ్ అయినా తర్వాత బ్యాటింగ్ వచ్చే బ్యాటర్ రెండు నిమిషాల్లో క్రీజులోకి వచ్చి బంతిని ఎదుర్కోవాలి. లేదంటే ‘టైమ్‌డ్ ఔట్’గా పరిగణించి బ్యాటర్‌ను అవుట్ ఇస్తారు. టెస్టుల్లో ఈ సమయం మూడు నిమిషాలుగా ఉండగా.. టీ20ల్లో 90 సెకన్లుగా ఉంది.
ఈ జాబితాలో భారత్ నుంచి ఓ క్రికెటర్ ఉన్నాడు. దేశవాళీలో త్రిపుర తరఫున ఆడిన హేములాల్ యాదవ్..1997 రంజీ సీజన్‌లో ఒడిషా, త్రిపుర మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసేందుకు తన వంతు వచ్చినా క్రీజులోకి వెళ్లకుండా బౌండరీ లైన్ వద్ద కోచ్‌తో ముచ్చట్లు పెట్టుకుంటూ గడిపాడు. దీంతో అంపైర్లు రెండు నిమిషాల తర్వాత అతడిని ఔట్‌గా ప్రకటించారు.
ఆ ఆరుగురు ఎవరంటే..
మాథ్యూస్ కంటే ముందు క్రికెట్‌లో ఈ రకంగా ఔట్ అయినవారు ఆరుగురు క్రికెటర్లు ఉన్నారు. 1987లో సౌతాఫ్రికాలో ఈస్టర్న్ ప్రావిన్స్ వర్సెస్ ట్రాన్స్‌వాల్ మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో ఆండ్రూ జోర్డాన్ ఇలాగే ఔటయ్యాడు. ఆసక్తికర విషయమేంటంటే.. వరదల కారణంగా ఆండ్రూ జోర్డాన్ స్టేడియానికి రావడం లేట్ అవడంతో అతడిని అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. సౌతాఫ్రికాలోనే బార్డర్ వర్సెస్ ఫ్రీ స్టేట్ మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో వాస్‌బర్ట్ డ్రేక్స్ కూడా టైమ్డ్ ఔట్ అయ్యాడు. ఈ గేమ్ కోసం డ్రేక్స్ ఫ్లైట్ ఆలస్యం కావడం వల్ల గ్రౌండ్‌కు రాక ఔట్ అయ్యాడు. ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్‌షైర్ వర్సెస్ డర్హమ్ మధ్య మ్యాచ్‌లో ఛార్లెస్ కుంజే.. క్రీజులోకి నిర్ణీత సమయంలోపు రాకపోవడంతో అంపైర్లు అతడికి షాకిచ్చారు. ఇంగ్లండ్‌కే చెందిన కాంబ్ సీ అండ్ సీ వర్సెస్ విండ్‌వార్డ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ర్యాన్ అస్టిన్ ఇదే రీతిలో నిష్క్రమించాల్సి వచ్చింది. జింబాబ్వేకు చెందిన దేశవాళీ జట్లు మటబిలాండ్ వర్సెస్ మౌంటెనర్స్ మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో చార్లెస్ కుంజే కూడా టైమ్డ్ ఔట్ అయ్యాడు.