- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
IND vs AUS : జైశ్వాల్ ఔటా?.. నాటౌటా?.. థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదం
దిశ, స్పోర్ట్స్ : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో థర్డ్ అంపైర్ నిర్ణయం మరోసారి వివాదాస్పదమైంది. నాలుగో టెస్టులో సోమవారం యశస్వి జైశ్వాల్ ఔటైన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో మిగతా బ్యాటర్లు నిరాశపర్చిన వేళ.. ఓపెనర్ జైశ్వాల్(84) జట్టును ఓటమి నుంచి తప్పించడానికి ఒంటరి పోరాటం చేశాడు. నిలకడగా ఆడిన అతను కమిన్స్ బౌలింగ్‌లో వివాదాస్ప రీతిలో వెనుదిరిగాడు. 71వ ఓవర్ వేసిన కమిన్స్ 5వ బంతిని జైశ్వాల్ లెగ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతి మిస్ అయ్యి వికెట్ కీపర్ చేతిలో పడింది.
క్యాచ్ అవుట్ అంటూ ఆసిస్ ప్లేయర్లు అప్పీలు చేయగా.. ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. దీంతో ఆసిస్ డీఆర్ఎస్ తీసుకుంది. ఆసిస్ అప్పీలను సమీక్షించిన థర్డ్ అంపైర్ ఔట్ అని తన నిర్ణయాన్ని ప్రకటించాడు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం స్నికో మీటర్‌లో స్పైక్ రాకపోవడమే. సాధారణంగా బంతి బ్యాటుకు తాకిందా?లేదా? అనేది స్నికో మీటర్‌లో వచ్చే స్పైక్‌ను బట్టి నిర్ణయిస్తారు.కానీ, జైశ్వాల్ విషయంలో స్నికో మీటర్‌లో స్పైక్ రాలేదు. స్పైక్ రాకున్నా.. బంతి గమనం మారడంతో థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై జైశ్వాల్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ మైదానాన్ని వీడాడు.
Snickometer didn't show anything..!!
— The Khel India (@TheKhelIndia) December 30, 2024
HOW IT IS OUT ????????? pic.twitter.com/nqV5FkKJ7r
నాలుగో టెస్టుకు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. జైశ్వాల్ నాటౌట్ అని తెలిపాడు. టెక్నాలజీ సాక్ష్యాన్ని తీసుకోకపోతే దాన్ని ఉపయోగించడం ఎందుకు? అన్ని ప్రశ్నించాడు.జైశ్వాల్ అవుటవడంతో భారత ఆశలు గల్లంతయ్యాయి.తొలి టెస్టులో కేఎల్ రాహుల్ థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయంతోనే పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే. అలాగే, పెర్త్ టెస్టులో మిచెల్ మార్ష్ విషయంలో మాత్రం థర్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో థర్డ్ అంపైర్ నిర్ణయాలు ఆసిస్‌కు అనుకూలంగా ఉంటున్నాయని సోషల్ మీడియాలో భారత అభిమానులు ఆరోపిస్తున్నారు.