Rishab pant : కోహ్లీని బీట్ చేసిన పంత్.. హయ్యస్ట్ ఇన్‌కమ్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్‌గా రికార్డు

by Sathputhe Rajesh |
Rishab pant : కోహ్లీని బీట్ చేసిన పంత్.. హయ్యస్ట్ ఇన్‌కమ్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్‌గా రికార్డు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్‌ను రూ.27 కోట్ల ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తర్వాతి స్థానంలో శ్రేయస్ అయ్యర్ రూ.26.75 కోట్లకు పంజాబ్, వెంకటేష్ అయ్యర్ రూ.23.75 కోట్లకు కేకేఆర్ జట్లు కొనుగోలు చేశాయి. ఆర్సీబీ కోహ్లీని రూ.21కోట్లకు రిటైన్ చేసుకుంది.

పంత్ హయ్యస్ట్ ఇన్‌కమ్ ప్లేయర్‌గా..

ఐపీఎల్ వేలంలో రూ.27 కోట్లకు లక్నో కొనుగోలు చేయడంతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో బీసీసీఐ, ఐపీఎల్ కాంట్రాక్టులతో అత్యధిక ఆదాయం అందుకోనున్న భారతీయ క్రికెటర్‌గా నిలవనున్నాడు. ఈ వికెట్‌-కీపర్ బ్యాట్స్ మెన్ ఏడాదికి క్రికెట్ కమిట్ మెంట్ల ద్వారా రూ.32 కోట్లు సంపాదించనున్నాడు. విరాట్ కోహ్లి రూ.28 కోట్ల ఆదాయం పొందనున్నాడు. బీసీసీఐ కాంట్రాక్టులో ఏ-కేటగిరిలో ఉన్న పంత్ ఏడాదికి రూ.5 కోట్లు అందుకుంటున్నాడు. ఐపీఎల్ కాంట్రాక్టు ద్వారా అందే రూ.27 కోట్లతో కలిపి పంత్ రూ.32 కోట్లు అందుకోనున్నాడు. బీసీసీఐ కాంట్రాక్టులో కోహ్లీ ఏ+ కేటగిరిలో ఉన్న కోహ్లీ ఏడాదికి రూ.7 కోట్లు అందుకుంటున్నాడు. ఐపీఎల్ ద్వారా రూ.21 కోట్లు రాగా మొత్తం ఏడాదికి రూ.28 కోట్లు అందుకోనున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో బీసీసీఐ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించనుంది. అయితే పంత్ ఏ+ కేటగిరిలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే పంత్‌ను మూడు ఫార్మాట్లకు ఆడించాలని బోర్డు భావిస్తోంది. ఒక వేళ పంత్ ఏ+ కేటగిరిలో చేరితే మరింత ఆదాయం పెరగనుంది. కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో బోర్డు ఏ కేటగిరికి పరిమితం చేయనుంది. శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్లు ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికినా బీసీసీఐ కాంట్రాక్టులో లేరు. శ్రేయస్ అయ్యర్ మాత్రం భారత జట్టులో స్థానం సంపాదించి బీసీసీఐ కాంట్రాక్టు లిస్టులో చేరే చాన్స్ ఉంది.

Advertisement

Next Story