తల్లి కాబోతున్నా.. గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌ పెట్రా క్విటోవా

by Vinod kumar |
తల్లి కాబోతున్నా.. గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌ పెట్రా క్విటోవా
X

దిశ, వెబ్‌డెస్క్: రెండుసార్లు వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌ పెట్రా క్విటోవా కొత్త సంవత్సరం తొలి రోజు తన అభిమానులతో శుభవార్త పంచుకుంది. తాను తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘‘2024 మొదటి రోజున మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రానున్న వేసవిలో జిరి, నేను మా కుటుంబంలోకి ఒక బిడ్డను స్వాగతించబోతున్నాం’’ అని 33 ఏళ్ల క్విటోవా పేర్కొంది. 2023 జులైలో తన దీర్ఘకాల కోచ్‌ జిరి వానెక్‌ను క్విటోవా పెళ్లాడింది. గత ఏడాది డిసెంబర్‌లో ప్రకటించిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఎంట్రీల జాబితాలో క్విటోవా పేరుంది. అయితే క్విటోవా గర్భం నేపథ్యంలో ఈనెల 14న ప్రారంభమయ్యే గ్రాండ్‌స్లామ్‌లో ఆమె ఆడుతుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story