ఆ సీటుకు ధోనీ పేరు

by Javid Pasha |
ఆ సీటుకు ధోనీ పేరు
X

న్యూఢిల్లీ : టీమ్ ఇండియా వన్డే వరల్డ్ కప్-2011 గెలిచి 12 ఏళ్ల అవుతున్నది. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై ధోనీ సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించిన క్షణాలను ఇప్పటికీ మర్చిపోలేం. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ధోనీ బాదిన ఆ సిక్స్‌తో దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ప్రపంచకప్ గెలిచి 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ధోనీని గౌరవించాలని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) నిర్ణయించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. వాంఖడే స్టేడియంలోని ఓ సీటుకు ధోనీ పేరు పెట్టాలని ఎంసీఏ నిర్ణయం తీసుకుంది.

ధోనీ సిక్స్‌గా మలిచిన బంతి ఎక్కడైతే పడిందో ఆ సీటుకు మహేంద్రుడి పేరు పెట్టనున్నట్టు ఎంసీఏ అధ్యక్షుడు అమోల్ కాలే తెలిపాడు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ధోనీని కోరామని, ఈ సందర్భంగా అతడిని సత్కరిస్తామని పేర్కొన్నాడు. కాగా, వాంఖడే స్టేడియంలో స్టాండ్స్‌లకు ఇప్పటికే దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, విజయ్ మర్చంట్ పేర్లు పెట్టగా.. స్టేడియం గేట్లకు పాలీ ఉమ్రిగర్‌, వినూ మన్కడ్‌ పేర్లు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed