- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రెండో రౌండ్‌లోకి సింధూ, శ్రీకాంత్, లక్ష్యసేన్
by Swamyn |

X
దిశ, స్పోర్ట్స్: స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాళ్లు సింధూ, లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో విజయం సాధించి రెండో రౌండ్‌కు అర్హత సాధించారు. మహిళల సింగిల్స్‌లో థాయిలాండ్ క్రీడాకారిణి పోర్న్‌పిచా చొయికీవాంగ్‌పై సింధూ 21-12, 21-13 తేడాతో విజయం సాధించగా, పురుషుల సింగిల్స్‌లో మలేషియా ప్లేయర్ లియాంగ్ జున్‌పై లక్ష్యసేన్ 21-19, 15-21, 21-11తో గెలుపొందాడు. వరల్డ్ మాజీ నం.1 కిదాంబి శ్రీకాంత్.. చైనీస్ తైపీ వాంగ్ జు వేపై 43 నిమిషాల్లోనే 21-17, 21-18తో మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. గురువారం జరగనున్న రెండో రౌండ్‌లో సింధూ జపాన్ ప్లేయర్ మియాజకీతో తలపడనుండగా, చైనీస్ తైపీ చియా హో లీతో లక్ష్యసేన్, మలేషియా టాప్ సీడ్ లీ జీ జియాతో శ్రీకాంత్ పోటీ పడనున్నాడు.
Next Story