- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Swiss Open : సెమీస్‌కు దూసుకెళ్లిన శ్రీకాంత్

దిశ, స్పోర్ట్స్ : స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-17, 21-15 తేడాతో చైనీస్ తైపీ షట్లర్ చియా హో లీపై విజయం సాధించాడు. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన శ్రీకాంత్ 35 నిమిషాల్లో వరుసగా గేమ్‌లను గెలుచుకుని ప్రత్యర్థిని మట్టికరిపించాడు. యువ షట్లర్ కిరణ్ జార్జ్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. రెండో రౌండ్‌లో కిరణ్ 18-21, 22-20, 21-18 తేడాతో అలెక్స్ లానియర్(ఫ్రాన్స్)పై విజయం సాధించాడు.
మరో భారత స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ రెండో రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. చైనీస్ తైపీ షట్లర్ చియా హో లీ చేతిలో 21-17, 21-15 తేడాతో లక్ష్యసేన్ పరాజయం పాలయ్యాడు. అలాగే, ఉమెన్స్ డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ జోడీ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గాయత్రి జోడీ 14-21, 15-21 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన సెట్యానా మపాస-ఏంజెలా యు చేతిలో పరాజయం పాలైంది.