- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. స్టార్ క్రికెటర్ దూరం?
by Harish |

X
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నట్టు తెలుస్తోంది. చీలమండల గాయానికి సర్జరీ చేయించుకున్న సూర్య ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావసం పొందుతున్నాడు. ఫిట్‌నెస్ సాధించేందుకు కష్టపడుతున్నాడు. అయితే, అతను మొదటి రెండు మ్యాచ్‌లు ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ‘అతను కచ్చితంగా ఐపీఎల్ ఆడతాడు. అయితే, తొలి రెండు మ్యాచ్‌లకు ఎన్‌సీఏ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడికల్ టీమ్ క్లియరెన్స్ ఇస్తుందా?లేదా? అనేది స్పష్టంగా తెలియదు.’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ నెల 24న గుజరాత్ జెయింట్స్‌తో ముంబై జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత రెండో గ్రూపు మ్యాచ్‌లో ఈ నెల 27న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
Next Story