- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ISPL 2023 : చెన్నై టీమ్‌ను కొనుగోలు చేసిన సూర్య..

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ టీ-10 టోర్నీలో భాగస్వామ్యం అయ్యేందుకు స్టార్ హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు. లోకల్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ఇదొక ప్లాట్‌ఫామ్‌లా ఉపయోగపడుతుందని భావిస్తున్న హీరోలు, టోర్నీలో ఫ్రాంజైజీలకు యజమానులుగా మారుతున్నారు. స్టార్ హీరోలు రామ్‌చరణ్, అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్ టోర్నీలో ఇప్పటికే ఆయా జట్లను కొనుగోలు చేయగా.. తాజాగా ఈ లిస్ట్‌లో కోలీవుడ్ హీరో సూర్య చేరారు. హీరో సూర్య ఐఎస్పీఎల్టీ 10లో 'టీమ్ చెన్నై' (తమిళనాడు) జట్టును కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలిపారు. 'నమస్కారం చెన్నై! ఐఎస్‌పీఎల్ టీ10లో మన టీమ్ చెన్నై జట్టును కొనుగోలు చేశానని తెలియజేస్తున్నా. మనం అందరం కలిసి క్రీడా స్ఫూర్తిని, క్రికెట్ వారసత్వాన్ని క్రియేట్ చేద్దాం' అని ట్వీట్ చేశారు. ఈ టోర్నీ తొలి ఎడిషన్ వచ్చే ఏడాది మార్చి 2 నుంచి 9 వరకు జరగనుంది. ఈ టోర్నీలో ఆరు మహానగరాలు హైదరాబాద్, ముంబయి, కోల్‌కతా, శ్రీ నగర్, బెంగళూరు, చెన్నై టీమ్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. లీగ్‌లో ప్రతీ మ్యాచ్10 ఓవర్ల ఫార్మాట్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లను టెన్నిస్ బాల్‌తో నిర్వహిస్తారు.
ఈ టోర్నీలో హీరోలు కొనుగోలు చేసిన జట్లు:
రామ్‌చరణ్- హైదరాబాద్
అమితాబ్ బచ్చన్- ముంబయి
హృతిక రోషన్- శ్రీ నగర్
సూర్య- చెన్నై