- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధోనీని కలిసిన పంత్.. ఏదో పెద్దగా జరగబోతోంది : రైనా ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, స్పోర్ట్స్ : ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్ రిషబ్ పంత్‌ను రిటైన్ చేసుకోని విషయం తెలిసిందే. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ పొరెల్, ట్రిస్టన్ స్టబ్స్‌లను అంటిపెట్టుకోగా.. పంత్‌ను వేలంలోకి వదిలేసింది. అయితే, పంత్ చెన్నయ్ సూపర్ కింగ్స్(సీఎస్కే)లో చేరతాడని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా, సీఎస్కే మాజీ ప్లేయర్ సురేశ్ రైనా.. చెన్నయ్ జట్టులో పంత్ చేరిక హింట్ ఇచ్చాడు. తాజాగా జియో సినిమాతో మాట్లాడుతూ..‘ఇటీవల ఢిల్లీలో ధోనీని కలిశాను. అప్పుడు పంత్ కూడా అక్కడే ఉన్నాడు. ఏదో పెద్దగా జరగబోతుందని అనుకుంటున్నా. త్వరలోనే ఎవరో యెల్లో జెర్సీని ధరించొచ్చు.’ అని వ్యాఖ్యానించాడు. రైనా వ్యాఖ్యలను బట్టి పంత్ సీఎస్కేలో చేరడం ఖాయమైనంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా, సీఎస్కే రుతురాజ్ గైక్వాడ్, ధోనీ, జడేజా, శివమ్ దూబె, పతిరణలను రిటైన్ చేసుకుంది. ధోనీని అన్‌క్యాప్ కోటా కింద రూ. 4 కోట్లకు అంటిపెట్టుకుంది.