- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Sunil Gavaskar: భారత జట్టు స్థాయికి పాక్ టీం సరిపోదు.. సునీల్ గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy-2025) ప్రారంభమైన ఆరు రోజులు కూడా గడవక ముందే ఆతిథ్య జట్టు పాకిస్థాన్ (Pakistan) టోర్నీ నుంచి నిష్క్రమించింది. సోంతగడ్డపై ఆద్భుతంగా ఆడి టైటిల్ కైవసం చేసుకుంటుందని భావించిన ఆ జట్టు అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. న్యూజిలాండ్ (New Zealand), భారత్ (India)తో జరిగిన వరుస మ్యాచ్‌లలో ఓటిమిపాలై ఇంటి దారి పట్టింది. ఈ క్రమంలోనే భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) పాక్ జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుం భారత జట్టు (Team India) చాలా పటిష్టంగా ఉందని మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) సారథ్యంలోని పాకిస్థాన్ టీమ్ (Pakistan Team) తమ జట్టుకు సరిపోదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాక్ జట్టును చూస్తుంటే భారత్-బి (India-B) జట్టును కూడా ఓడించలేదని అనిపిస్తోందని జోస్యం చెప్పారు. పాకిస్థాన్ డిఫెండింగ్ ఛాంపియన్‌లా బరిలోకి దిగి టీమిండియాకు గట్టి పోటీ ఇస్తుందని భావించా కానీ తన అంచనాలు తారుమారు అయ్యాయని అన్నారు. దేశీయ టోర్నీలో పాక్ ఆటగాళ్లు నిత్యం ఆడుతున్నప్పటికీ.. అంతర్జాతీయ మ్యాచ్‌లలో జట్టు పరంగా, వ్యక్తిగతంగా వరుసగా విఫలం అవుతున్నారని తెలిపారు. ఓటిమిపై ఇప్పటికైనా ఆ జట్టు సమీక్షించుకోవాలని సలహా ఇచ్చారు. కాగా, సోమవారం బంగ్లాదేశ్ (Bangladesh)తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ (New Zealand) విజయం సాధించడంతో పాకిస్థాన్ ఆశలు తుడిచిపెట్టుకుపోయాయి. ఫలితంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాక్ జట్టు రేపు బంగ్లాదేశ్‌తో నామమాత్రపు చివరి మ్యాచ్‌లో తలపడుతుంది.