- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ షాట్లు ఆడటంలో రోహిత్ ఇబ్బంది పడుతున్నాడు.. గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: సిరీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 8 ఓవర్లకు మ్యాచ్ కుదించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 90 పరుగులు చేసింది. అనంతరం 91 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. కేవలం 20 బంతుల్లోనే 46 పరుగులు చేసి భారత్‌ను సిరీస్ రేసులో నిలబెట్టాడు. గత కొంత కాలంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న రోహిత్.. ఆసీస్‌పై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో రోహిత్ విన్నింగ్ పర్ఫార్మెన్స్‌పై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. '' ఆసీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచులో రోహిత్ శర్మ.. పుల్ షాట్లు, ఫ్లిక్ షాట్లు అద్భుతంగా ఆడాడు. కానీ అతడు ఆఫ్ సైడ్ షాట్లు ఆడటంలో ఇబ్బంది పడుతున్నాడు. ఆ షాట్ల ఎంపికలో కాస్త స్పష్టత కొరవడింది. దీని ఫలితంగా స్టాండ్స్‌కు పంపాల్సిన బంతిని.. గాల్లోనే లేపుతున్నాడు. ఈ ఒక్క విషయం మినహాయిస్తే.. అతడు మ్యాచ్ చివరి వరకు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. పుల్ షాట్లు చాలా కాన్ఫిడెంట్‌గా ఆడాడు. ఎలాంటి భయం లేకుండా భారీ సిక్సర్లు కొట్టాడు'' అని గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Also Read : INDvsAUS: రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. పార్కింగ్ స్థలాలు ఇవే!