- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం..
దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్ కప్‌లో శ్రీలంక జట్టు వైఫల్యంతో ఆ దేశ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో జింబాబ్వేతో వన్డే, టీ20 సిరీస్ కోసం ముగ్గురు కెప్టెన్లను నియమించింది. ప్రపంచకప్‌లో తీవ్రంగా నిరాశపరిచిన వన్డే సారథి దసున్ శనకపై వేటు వేస్తూ.. స్టార్ బ్యాటర్ కుశాల్ మెండిస్‌కు పూర్తి స్థాయిలో వన్డే కెప్టెన్సీ అప్పగించింది. ఇక మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగ టీ20 కెప్టెన్‌గా ప్రకటించింది. దీంతో దిముత్ కరుణరత్నే టెస్టు సారథిగా పరిమితం కానున్నాడు. వన్డే, టీ20లకు చరిత అసలంక వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. లంక, జింబాబ్వే మధ్య మూడు వన్డేల సిరీస్ జనవరి 6న మొదలు కానుంది. అనంతరం జనవరి 14 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్ షురూ కానుంది.
వన్డే జట్టు :
కుశాల్ మెండిస్(కెప్టెన్), అసలంక(వైస్ కెప్టెన్), పతుమ్ నిస్సంక, సదీర సమరవిక్రమ, అవిష్క ఫెర్నాండో, సహన్ అరాచిగో, నువనిందు ఫెర్నాడో, దసున్ శనక, కమిందు మెండిస్, జనిత్ లియనగె, చమిక కరుణరత్నే, హసరంగ, థీక్షణ, దిల్షాన్ మధుషనక, చమీర, వెల్లలాగే, ప్రమోద్ మధుషాన్, అసిత ఫెర్నాండో, అకిల ధనంజయ, జెఫ్రీ వండర్సే, చమిక గుణశేఖర.
టీ20 టీమ్ :
వనిందు హసరంగ(కెప్టెన్), అసలంక (వైస్ కెప్టెన్), నిస్సంక, కుశాల్ మెండిస్, శనక, మాథ్యూస్, డిసిల్వా, థీక్షణ, పెరీర, రాజపక్సే, కమిందు మెండిస్, వెల్లలాగే. ధనంజయ, వాండర్సే, కరుణరత్నే, చమీర, మధుషనక, ఫెర్నాండో, తుషార, మధుషాన్, పథిరన.