Mohammed Siraj : సిరాజ్‌కు రవి శాస్త్రి మద్దతు.. అలా చేయాలని అడ్వైస్

by Sathputhe Rajesh |   ( Updated:2024-12-10 12:22:05.0  )
Mohammed Siraj : సిరాజ్‌కు రవి శాస్త్రి మద్దతు.. అలా చేయాలని అడ్వైస్
X

దిశ, స్పోర్ట్స్ : సిరాజ్(Mohammed Siraj) ఒక్క అడుగు వెనక్కి వేయకూడదని భారత మాజీ కోచ్ రవి శాస్త్రి( Ravi Shastri) అన్నాడు. ఆస్ట్రేలియా మీడియాలో రాసిన ఓ కాలమ్‌లో శాస్ర్తి ఈ మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘ఆస్ట్రేలియాలో భారత్ రెండు సిరీస్‌లు గెలిచినప్పుడు కోచ్‌గా వ్యవహరించాను. కోచ్‌గా ఉన్నప్పుడు ఒక్క భారత ఆటగాడు వెనక్కి తగ్గకూడదని చెప్పాను. ఫాస్ట్ బౌలర్ బౌలింగ్‌లో సిక్స్ కొడితే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. అది ఫాస్ట్ బౌలర్ టెంపర్‌మెంట్. దాన్ని అలాగే కొనసాగించాలి. నేడు ఆడుతున్నప్పుడు సైతం ఒకటే ఫిలాసఫీ.. ఎదుటి వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అలాగే మన రియాక్షన్ ఉండాలి. విరాట్, రిషభ్ పంత్ సహా టీం మెంబర్లంతా ఆసీస్‌కు తిరిగి ఇచ్చేందుకు ప్రిపేర్ అయి ఉండాలి.’ అన్నాడు. అయితే అడిలైడ్ టెస్ట్ సందర్భంగా హెడ్ ఔట్ అయిన తర్వాత సిరాజ్ ప్రవర్తనను ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా, ఒక డీ మెరిట్ పాయింట్‌ను ఫైన్‌గా విధించింది.

Next Story

Most Viewed