- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరేళ్ల తర్వాత టాప్-10లో సింధు ర్యాంక్ గల్లంతు
న్యూఢిల్లీ : బ్యా్డ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు టాప్-10 చోటు కోల్పోయింది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో విజేతగా నిలిచిన తర్వాత సింధు గాయం కారణంగా చాలా రోజులు ఆటకు దూరమైంది. గాయం నుంచి కోలుకుని తిరిగివచ్చినప్పటికీ పూర్ ఫామ్‌తో దారుణంగా విఫలమవుతున్నది. సింధు రెండో రౌండ్‌కు కూడా చేరుకోవడమే కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం బీడబ్ల్యూఎఫ్ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సింధు రెండు స్థానాలు దిగజారి 60, 448 పాయింట్లతో 11వ ర్యాంక్‌కు పడిపోయింది.
దాదాపు ఆరేళ్ల తర్వాత సింధు టాప్-10లో ర్యాంక్ కోల్పోయింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 9వ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. కిదాంబి శ్రీకాంత్ 21, లక్ష్యసేన్ 25 స్థానాల్లో ఉన్నారు. పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ జోడీ సాత్విక్-చిరాగ్ శెట్టి ద్వయం 6వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఈ జోడీ ఇటీవల స్విస్ ఓపెన్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ-గాయత్రి గోపిచంద్ 18వ ర్యాంక్‌లో కొనసాగుతున్నది.