- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Saurabh Ganguly: మహ్మద్ షమీ రీ ఎంట్రీ.. సౌరభ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) మళ్లీ మైదానంలోకి అడుగు పెడుతున్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్ (2023 One Day World Cup) ఫైనల్ తరువాత గాయం కారణంగా ఆటకు దూరమైన అతడు.. తాజాగా పూర్తి ఫిట్‌నెస్ సాధించి పాకిస్థాన్ (Pakistan) వేదికగా జరగబోతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)కి ఎంపికయ్యాడు. అదేవిధంగా ఇంగ్లాండ్ (England) టీ20, వన్డే సిరీస్‌లో కూడా షమీ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Saurabh Ganguly) సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహ్మద్ షమీ (Mohammed Shami) గ్రౌండ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వడం భారత జట్టు (Team India)కు బలంగా చేకూరినట్లైందని అన్నారు. షమీ ఫిట్‌గా ఉన్నందుకు తాను ఎంతగానో సంతోషిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తరువాత దేశంలోనే అత్యుత్తమ బౌలర్ షమీ అని తాను భావిస్తున్నానని కామెంట్ చేశారు. అతడు ప్రస్తుం ప్రెషర్‌లో ఉంటాడని తనకు తెలుసని.. చాలా కాలం తరువాత గాయం నుంచి కోలుకుని క్రికెట్ ఆడుతున్నాడని తెలిపారు. దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్ తరఫున ఆడటం అతడికి కలిసొచ్చిందని, షమీ రాకతో బుమ్రాకు కాస్త విశ్రాంతి లభిస్తుందని సౌరభ్ గంగూలీ అన్నారు.