ఆ సిరీస్‌కు జట్టులో దక్కుతుందన్న ఆశలు లేవు.. కానీ.. : సర్ఫరాజ్ ఖాన్ కీలక వ్యాఖ్యలు

by Harish |
ఆ సిరీస్‌కు జట్టులో దక్కుతుందన్న ఆశలు లేవు.. కానీ.. : సర్ఫరాజ్ ఖాన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన టీమ్ ఇండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తిరిగి జట్టులోకి వచ్చేందుకు ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబు టోర్నీ‌లో నిరూపించుకోవాలని చూస్తున్నాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో సర్ఫరాజ్ ఖాన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో భారత జట్టులో చోటు దక్కుతుందన్న ఆశలు లేవన్నాడు.

అయితే, అవకాశం కోసం తాను ఎదురుచూస్తుంటానని, ఇప్పటివరకు అదే చేశానని చెప్పాడు. ‘భారత్ తరపున ఆడాలని మా నాన్న, నేను కలగన్నాం. ఇంగ్లాండ్‌పై ఆ కల నెరవేరింది. కానీ, అది అక్కడితోనే ఆగిపోదు. ఆ కలను మరింత పొడిగించుకోవాలి. అందుకోసం చాలా కష్టపడాలి. నాకు హాఫ్ సీజన్ అంటూ ఉండదు. ఉదయం 4:15 లేచి 4:30కి పరుగు ప్రారంభించడంతో నాకు రోజు మొదలవుతుంది. చాలా దూరం పరుగెడతాను. నా ఫిట్‌నెస్ మెరుగుపడటానికి ఇది ఉపయోగపడుతుంది. నెలాఖరులో 30 నిమిషాల్లో 5 కి.మీలు పరుగెత్తాలి. నేను బంగ్లా సిరీస్ కోసం చూడటం లేదు. బుచ్చిబాబు టోర్నీ నాకు చాలా ముఖ్యమైనది.’ అని చెప్పుకొచ్చాడు.

కాగా, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌తో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. అయినప్పటికీ మార్చి నుంచి అతను కాంపిటేటివ్ క్రికెట్‌కు దూరంగానే ఉన్నాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి రావడంతో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్ ఖాన్‌ ఎంపికపై అనుమానాలు నెలకొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed