- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గిల్ డిఫెన్స్‌పై ఫోకస్ పెట్టు.. యువ బ్యాటర్‌కు సంజయ్ మంజ్రేకర్ సూచన
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ డిఫెన్స్‌పై ఫోకస్ పెట్టాలని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. రాంచీ టెస్టులో గిల్ 38 పరుగుల స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. క్రీజులో పాతుకపోయినట్టే కనిపించిన అతను షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ సందర్భంగా గిల్ ఆటతీరుపై సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో పరుగులు సాధించేందుకు గిల్ బౌండరీలు, సిక్స్‌లపైనే ఎక్కువగా ఆధారపడతాడని అభిప్రాయపడ్డాడు. ‘అతనికి ఇంతకు ముందే. గిల్ డిఫెన్స్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టాలి.’ అని సూచించాడు.
కాగా, నాలుగో టెస్టులో రోహిత్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన గిల్.. జైశ్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. రెండో వికెట్‌కు కీలకమైన 84 పరుగులు జోడించాడు. 65 బంతులు ఆడిన అతను 38 పరుగులు చేశాడు. మొదట్లో నిదానంగా ఆడిన అతను ఆ తర్వాత గేర్ మార్చాడు. అండర్సన్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టిన గిల్.. రాబిన్సన్ బౌలింగ్‌లోనూ మరో రెండు ఫోర్లు బాదాడు. దీంతో క్రీజులో పాతుకపోయినట్టే కనిపించిన అతను షోయబ్ బషీర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నప్పటికీ ఫలితం దక్కకపోవడంతో అతను నిరాశగా మైదానం వీడాడు. కొంతకాలంగా టెస్టుల్లో పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడిన గిల్.. వైజాగ్ టెస్టులో సెంచరీతో ఫామ్ అందుకున్నాడు. రాజ్‌కోట్ టెస్టులోనూ 91 పరుగులతో సత్తాచాటాడు. ప్రస్తుతం సిరీస్‌లో టాప్ రన్ స్కోరర్లలో గిల్ 290 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.