- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశ ప్రజలకు సచిన్ టెండుల్కర్ కీలక పిలుపు
దిశ, వెబ్‌డెస్క్: మనిషి జీవితంలో కొన్ని అలవాట్లు సాధారణంగానే వస్తుంటాయి. ముఖ్యంగా మందు, సిగరెట్, తంబాకు వంటి అలవాట్లు ఫ్రెండ్స్ వల్లనో, టెన్షన్ వల్లనో వస్తుంటాయి. అలవాటు చేసుకోవడం ఈజీగానే ఉంటుంది కానీ, మానేయడం చాలా కష్టతరంగా మారుతుంది. ఈ అలవాట్ల బారిన పడి అనేక కుటుంబాలు రోడ్డున పడిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే పొగాకు అలావాటు ఉన్న భారతీయులకు ప్రముఖ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కీలక సూచనలు చేశారు. ప్రపంచ పొగాకు దినోత్సవం సందర్భంగా పొగాకు ఉత్పత్తులను సేవించకూడదని దేశ ప్రజలకు, తన అభిమానులకు సచిన్ పిలుపునిచ్చారు. పొగాకును ఎప్పుడూ ప్రమోట్ చేయొద్దని తన కెరీర్ ప్రారంభంలో తన తండ్రి చెప్పిన సందర్భాన్ని సచిన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తాను దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని తెలిపారు. అందరూ అలాగే ఉండాలని కోరారు. మంచి భవిష్యత్తు కోసం పొగాకు కంటే ఆరోగ్యాన్ని ఎంచుకుందామని చెప్పారు.