Rohit Sharma: రోహిత్ శర్మ వీరోచిత సెంచరీ.. మ్యాచ్ అనంతరం సంచలన వ్యాఖ్యలు

by Shiva |
Rohit Sharma: రోహిత్ శర్మ వీరోచిత సెంచరీ.. మ్యాచ్ అనంతరం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌ (England)తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా (Team India) 4 వికెట్ల తేడాతో అద్భత విజయం సాధించింది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ జట్టు 2-0తో సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. అయితే, గత కొద్ది రోజులుగా ఫామ్‌ అందిపుచ్చుకోక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం ప్రెస్‌మీట్‌లో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer , శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) అందించిన సహకారంతోనే తాను శతకాన్ని సాధించానని కామెంట్ చేశారు.

మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌ను చాలా ఆస్వాదించానని పేర్కొన్నాడు. సిరీస్‌లో.. అది కూడా కీలకమైన మ్యాచ్‌లో జట్టు తరఫున అత్యధిక రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ మ్యాచ్‌లో తాను ఎలా బ్యాటింగ్ చేయాలనేది ముందుగానే ప్లాన్ చేసుకున్నానని తెలిపారు. వన్డే ఫార్మాట్ టీ20 గేమ్ కంటే పెద్దదని.. టెస్ట్ క్రికెట్ కంటే చిన్నదని అన్నారు. కండీషన్స్‌ను తగినట్లుగా బ్యాటింగ్ చేశానని తెలిపారు. ముఖ్యంగా సాధ్యమైనంత మేర ఇన్నింగ్స్ చివరి వరకు బ్యాటింగ్ చేసేందుకు డిసైడ్ అయ్యాయని పేర్కొనన్నారు. ఇంగ్లాండ్ (England) బౌలర్లు బాడీని బేస్ చేసుకుని బంతులు సంధించారని.. తాను మాత్రం క్రీజ్ నుంచి ఎటూ కదలకుండా బ్యాటింగ్ చేయడం లాభించిందని అన్నారు. చెత్త బంతులను వదలకుండా బౌండరీలకు తరలించానని తెలిపారు. తన సెంచరీకీ ప్రధాన కారణం శుభ్‌మన్ గిల్ (Shubhman Gill), శ్రేయాస్ అయ్యర్‌ (Shreyas Iyer) అందించిన సహకారం లభించిందని రోహిత్ శర్మ అన్నారు.

Next Story

Most Viewed