- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఏక్ నిరంజన్!

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025) భాగంగా దుబాయ్ (Dubai) వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్ (Semi Final)లో టీమిండియా (Team India), పటిష్ట జట్టు ఆస్ట్రేలియా (Australia)ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. రన్ మిషిన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) జూలు విదిల్చాడు. ఏకంగా 98 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా మరో బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) 62 బంతుల్లో 45, కేఎల్ రాహుల్ (KL Rahul) 34 బంతుల్లో 42 పరుగులు చేసి టీమిండియా (Team India) ఫైనల్ చేరడంలో తమ సహకారాన్ని అందించారు. ఈ క్రమంలోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
మొత్తం నాలుగు ఐసీసీ (ICC) టోర్నీల్లో ఫైనల్ చేరిన ఏకైక కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. రోహిత్ శర్మ (Rohit Sharma) మినహా ఏ ప్లేయర్ కూడా ఆటగాడు కూడా ఇప్పటి వరకు నాలుగు ఐసీసీ టోర్నీల్లో కెప్టెన్‌గా ఫైనల్ చేరలేదు. రోహిత్ శర్మ సారథిగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్-2023 (World Test Championship-2023) ఫైనల్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో టీమిండియా (Team India) ఓడింది. అదేవిధంగా వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లోనూ ఆసీస్.. రోహిత్ సారథ్యంలోని భారత్‌ను ఓడించింది. గతేడాది రోహిత్ సారథ్యంలోనే టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 గెలిచింది. తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy-2025)లో హిట్ మ్యాన్ కెప్టెన్సీలోనే ఫైనల్ చేరింది. దీంతో నాలుగు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ చేరిన కెప్టెన్‌గా రోహిత్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.
ఆ ఇద్దరికీ సాధ్యం కానిది..
అయితే, భారత కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ (Mahindra Singh Dhoni) మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచాడు. కానీ, అతడి హయాంలో అప్పటికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఈవెంట్ లేదు. 2019-21 ఎడిషన్ నుంచే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తోంది. విరాట్ కోహ్లీ (Virat Kohli) సారథ్యంలోని టీమిండియా.. వరల్ట్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2019-21 ఫైనల్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్ మాత్రమే ఆడింది. వన్డే ప్రపంచకప్ 2019తో పాటు టీ20 ప్రపంచకప్ 2016లో కోహ్లీ సారథ్యంలోని టీమిండియా సెమీస్‌లోనే వెనుదిరిగింది.