- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతని కెప్టెన్సీ చూసి నేర్చుకున్నా: రోహిత్ శర్మ
దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. మూడు రోజుల్లోపే ముగిసిన ఈ టెస్టులో టీమిండియా ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. భారత స్పిన్నర్ల దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయం అనంతరం తన కెప్టెన్సీ గురించి రోహిత్ శర్మ మాట్లాడాడు. టెస్టుల్లో భారత బౌలింగ్ విభాగాన్ని విరాట్ కోహ్లీ అద్భుతంగా మేనేజ్ చేసే వాడని.. అది చూసి తాను చాలా నేర్చుకున్నానని చెప్పాడు. పిచ్ అనుకూలంగా ఉన్నా.. ప్రత్యర్థి బ్యాటర్లపై నిరంతరం ఒత్తిడి పెడితేనే అది సాధ్యమని వివరించాడు.
'నేను ఆటగాడిగా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. అప్పుడే ఒక విషయం గమనించా.. వికెట్లు దక్కినా దక్కకపోయినా ప్రత్యర్థిపై ఒత్తిడి మాత్రం కచ్చితంగా ఉండేది. సరైన ఫీల్డింగ్ సెటప్, బౌలింగ్‌తో ఒత్తిడి పెట్టడంతో ప్రత్యర్థులు పొరపాటు చేసే అవకాశం పెరుగుతుంది. విరాట్ కెప్టెన్సీలో వీళ్లు బౌలింగ్ చేయడం చూసి నేను అదే నేర్చుకున్నా' అని రోహిత్ వెల్లడించాడు.