అతను అచ్చం ధోనీలానే కెప్టెన్సీ చేస్తున్నాడు : సురేశ్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Harish |
అతను అచ్చం ధోనీలానే కెప్టెన్సీ చేస్తున్నాడు : సురేశ్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను టీమ్ ఇండియా 3-1తో దక్కించుకున్న విషయం తెలిసిందే. రాంచీ టెస్టులో అద్భుత విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతమైంది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, షమీ వంటి అనుభవుజ్ఞులు లేకపోయినా రోహిత్ నాయకత్వంలో యువ క్రికెటర్లు అదరగొట్టారు. దీంతో రోహిత్ కెప్టెన్సీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కూడా చేరాడు. తాజాగా ఓ జాతీయా మీడియాతో మాట్లాడుతూ.. హిట్ మ్యాన్‌పై ప్రశంసల వర్షం కురింపిచాడు. రోహిత్ మరో ధోనీలా కనిపిస్తున్నాడని కితాబు ఇచ్చాడు. ‘సౌరవ్ గంగూలీ జట్టుకు మద్దతుగా నిలిచేవాడు. ఆ తర్వాత ధోనీ వచ్చి జట్టును ముందుకు నడిపించాడు. ధోనీ నాయకత్వంలో నేను చాలా క్రికెట్ ఆడాను. ధోనీలాగే రోహిత్ యువకులకు అవకాశాలు ఇస్తున్నాడు. రోహిత్ తెలివైన నాయకుడు. కెప్టెన్‌గా బాగా చేస్తున్నాడు.’ అని రైనా తెలిపాడు. అలాగే, యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌ను కూడా రైనా పొగిడాడు. జురెల్ అద్భుతంగా ఆడాడని, బంతి టర్న్ అయ్యే పిచ్‌పై అతను ఆడిన ఇన్నింగ్స్ స్పెషల్ అని చెప్పాడు. అయితే, ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్‌ క్రెడిట్ మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మకు దక్కుతుందన్నాడు.

Advertisement

Next Story