రోహిత్‌పై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు.. నెట్స్‌లో నన్ను ఎదుర్కోలేడని కామెంట్

by Harish |   ( Updated:2024-07-20 14:09:22.0  )
రోహిత్‌పై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు.. నెట్స్‌లో నన్ను ఎదుర్కోలేడని కామెంట్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ భారత కెప్టెన్ రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నెట్స్‌లో తనను ఎదుర్కోవడానికి రోహిత్ ఇష్టపడడని వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ.. భారత జట్టు నెట్ సెషన్స్ గురించి మాట్లాడాడు. విరాట్‌ కోహ్లీకి సవాల్ విసరడం ఇష్టమని చెప్పాడు. ‘విరాట్, నేను పరస్పరం సవాల్ విసురుకుంటాం. అతను మంచి షాట్లు కొట్టాలనుకుంటాడు. నేను అతన్ని అవుట్ చేయాలనుకుంటా. అందులోనూ బంధం, స్నేహం ప్రతిబింబిస్తాయి. అంతేకాకుండా, ఫోకస్‌గా ఉండటానికి కూడా సహాయపడతాయి. వాటిని మేము ఎంజాయ్ చేస్తాం.’ అని చెప్పాడు.

రోహిత్ గురించి మాట్లాడుతూ..‘రోహిత్ నన్ను ఎదుర్కోవడానికి ఇష్టపడడు. నాకు వ్యతిరేకంగా అతను బ్యాటింగ్ చేయడాన్ని నిరాకరిస్తాడు.’ అని నవ్వుతూ చెప్పాడు. కాగా, వన్డే వరల్డ్ కప్ తర్వాత చీల మండలం గాయానికి గురైన అతను ఫిబ్రవరిలో సర్జరీ చేయించుకున్నాడు. శస్త్రచికిత్స నుంచి కోలుకున్న షమీ ప్రస్తుతం ఎన్‌సీఏలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. సెప్టెంబర్-అక్టోబర్‌లో జరిగే బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు అతను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story