- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rishabh Pant : చెన్నయ్ జట్టులోకి పంత్?.. కారణం ఏంటంటే?
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ వచ్చే సీజన్‌కు ముందు మెగా వేలం ఉండటంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మార్పులకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌పై వేటు వేసిన మేనేజ్‌మెంట్.. కెప్టెన్ రిషబ్ పంత్‌తో కూడా బంధాన్ని తెంచుకోవాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, పంత్ కూడా జట్టును వీడాలని చూస్తున్నట్టు ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. వచ్చే సీజన్‌లో రిషబ్ చెన్నయ్ సూపర్ కింగ్స్‌లో చేరాలని భావిస్తున్నాడని సదరు సంస్థ పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన వస్తేనే క్లారిటీ రానుంది.
2021లో పంత్ ఢిల్లీ పగ్గాలు చేపట్టాడు. పంత్ నాయకత్వంలోనూ ఢిల్లీ తొలి టైటిల్ కల సాకారం కాలేదు. 2021లో మూడో స్థానంలో నిలువగా.. 2022లో 5వ స్థానంతో సరిపెట్టింది. ఇక, గతేడాది కారు ప్రమాదం కారణంగా అతను సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఆ సీజన్‌లో జట్టును వార్నర్ నడిపించాడు. ఈ సీజన్‌కు అందుబాటులోకి వచ్చిన పంత్ ఆటగాడిగా సత్తాచాటాడు. 13 మ్యాచ్‌ల్లో 446 పరుగులు చేశాడు. అయితే, కెప్టెన్‌గా మాత్రం నిరాశపరిచాడు. ఢిల్లీ 9వ స్థానంతో సీజన్‌ను ముగించింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ కెప్టెన్‌గా పంత్ ప్రదర్శనపై ఫ్రాంచైజీ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే సీజన్‌కు అతన్ని రిటైన్ చేసుకోవడంపై అనుమానాలు నెలకొన్నాయి. పంత్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలని ఢిల్లీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరవ్ గంగూలీ పట్టుబట్టినట్టు సమాచారం. ఢిల్లీ రిటైన్ చేసుకోకపోతే పంత్ చెన్నయ్ జట్టులో చేరాలని భావిస్తున్నట్టు జాతీయ మీడియా సంస్థ తెలిపింది. గతేడాది రుతురాజ్ గైక్వాడ్‌కు చెన్నయ్ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. మరి, పంత్ జట్టులోకి వస్తే గైక్వాడ్‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తారా?లేదా పంత్‌కు పగ్గాలు అప్పగిస్తారా? అన్న దానిపై చర్చ జరుగుతుంది.