- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ధోనీతో పోల్చొద్దు.. నాలాగే ఉంటా : రిషబ్ పంత్
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీతో తనను పోల్చొద్దని భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ వ్యాఖ్యానించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ సెంచరీ బాది భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా, టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన భారత వికెట్ కీపర్‌గా ధోనీ(6 సెంచరీలు) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. ఆదివారం మ్యాచ్ సందర్భంగా పంత్ మాట్లాడుతూ ధోనీపై తనను పోల్చడంపై స్పందించాడు.
‘చెపాక్ స్టేడియం చెన్నయ్ సూపర్ కింగ్స్‌కు హోం గ్రౌండ్. ఇక్కడ మహీ బాయ్ చాలా క్రికెట్ ఆడాడు. కానీ, నేను గతంలో చెప్పిందే మళ్లీ చెబుతున్నా. నేను నాలాగే ఉండాలనుకుంటున్నా. నా గురించి ఏం మాట్లాడుతున్నారు, నా చుట్టు ఏం జరుగుతుంది అనే విషయాలపై నేను పట్టించుకోను. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే నా దృష్టి ఉంటుంది.’ అని తెలిపాడు.
అలాగే, ఆటలో మూడో రోజు బంగ్లాదేశ్ ఫీల్డింగ్ సెట్ చేయడానికి గల కారణాన్ని పంత్ వివరించాడు. క్రికెట్ నాణ్యతను పెంచడానికే అలా చేసినట్టు చెప్పాడు. ‘అజయ్ భాయ్‌తో మాట్లాడినప్పుడు అతను ఒక్క మాట అన్నాడు. క్రికెట్ నాణ్యత మెరుగుపడాలని చెప్పాడు. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మిడ్ వికెట్ వద్ద ఫీల్డర్ లేడు. మరో ఏరియాలో ఇద్దరు ఫీల్డర్లు ఉన్నారు. అందుకే, ఒక ఫీల్డర్‌ను మిడ్ ఫీల్డ్ పొజిషన్‌కు పంపించమని చెప్పా.’ అని తెలిపాడు. పంత్ సూచనతో బంగ్లా కెప్టెన్ శాంటో ఒక ఫీల్డర్‌ను మిడ్ వికెట్ ఏరియాకు వద్దకు పంపించాడు.