Dinesh Karthik కంటే అతడే బెటర్.. ఫస్ట్ నుండే చెప్పినా వినలే: Virender Sehwag ఆసక్తికర వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2022-10-31 12:31:31.0  )
Dinesh Karthik కంటే అతడే బెటర్.. ఫస్ట్ నుండే చెప్పినా వినలే: Virender Sehwag ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో వరుసగా విఫలమవుతోన్న భారత సీనియర్ ప్లేయర్ దినేష్ కార్తీక్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ సెహ్వెగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆస్ట్రేలియా పిచ్‌లకు దినేష్ కార్తీక్ కంటే టీమిండియా యంగ్ బ్యాటర్ రిషబ్ పంతే బెస్ట్ అని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఈ పిచ్‌లపై డీకే కంటే పంత్‌కే ఎక్కువ ఆడిన అనుభం ఉందని తెలిపాడు. ఆస్ట్రేలియా పిచ్‌లు పేస్‌కు స్వర్గధామమని.. ఇలాంటి బౌన్సీ పిచ్‌లపై ఎలా ఆడాలో పంత్‌కు బాగా తెలుసని చెప్పాడు.

అందుకే ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్‌లో దినేష్ కార్తీక్ కంటే రిషబ్ పంతే కరెక్ట్ అని తాను మొదటి నుండే చెబుతున్నానని అన్నాడు. కానీ, తాను చెప్పినా విషయాన్ని ఎవరూ అర్థం చేసుకోకుండా పంత్‌కు ప్లేయింగ్ లెవన్‌లో చోటు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా జట్టు మేనెజ్మెంట్ దీని గురించి ఆలోచించి.. తర్వాతి మ్యాచులకు పంత్‌కు అవకాశం ఇవ్వాలని సూచించాడు.

ఇక, సౌతాఫ్రికాపై భారత్ ఓటమి చవిచూడంతో మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వరుసగా విఫలమవుతోన్న ఓపెనర్ కేఎల్ రాహుల్, దినేష్ కార్తీక్‌ను జట్టు నుండి తప్పించి.. పంత్ వంటి యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలంటున్నారు. ఇక, ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా సూపర్ 12 దశలో మూడు మ్యాచులు ఆడిన టీమిండియా రెండు విజయాలు సాధించింది. లీగ్ తొలి మ్యాచులోనే దాయాది పాక్‌ను మట్టికరిపించి వరల్డ్ కప్ ప్రారంభాన్ని ఘనంగా ఆరంభించింది. రెండవ మ్యాచులో నెదర్స్లాండ్‌పై ఘన విజయం సాధించిన భారత్.. సౌతాఫ్రికాతో జరిగిన మూడవ మ్యాచులో ఓటమి చవిచూసింది.

Advertisement

Next Story

Most Viewed