- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంత్ భయపెట్టాడు.. అతని వికెటే టర్నింగ్ పాయింట్ : కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్
దిశ, స్పోర్ట్స్ : ముంబై టెస్టులో రిషబ్ పంత్ తమ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నంత పనిచేశాడని న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ వ్యాఖ్యానించాడు. తాజాగా మీడియాతో అజాజ్ మాట్లాడుతూ.. నాలుగో ఇన్నింగ్స్‌లో పంత్ వికెటే మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాడు. ‘మ్యాచ్‌లో మేము గెలుస్తామని రోహిత్, కోహ్లీలను అవుట్ చేయకుముందే మాకు నమ్మకం కలిగింది. బోర్డుపై పెట్టిన పరుగులు గెలవడానికి సరిపోతాయని నమ్మాం. ప్రారంభంలో ఎక్కువ వికెట్లు పొందడంతో మా నమ్మకం మరింత ఎక్కువైంది. అయితే, పంత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మా నుంచి గేమ్‌ను లాగేసుకునేలా కనిపించాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండటం, మనం నియంత్రించే వాటిని నియంత్రించడం ముఖ్యం.’ అని చెప్పుకొచ్చాడు.
మూడో టెస్టులో టీమిండియా 25 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. 147 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా కోల్పోయింది. భారత్ ఇన్నింగ్స్‌లో పంత్(64) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. పంత్ క్రీజులో ఉన్నంత సేపు టీమిండియా గెలిచేలా కనిపించగా అతను అవుటవడంతో మ్యాచ్ కివీస్ వైపు తిరిగింది. ముంబై టెస్టులో ఓటమితో టీమిండియా స్వదేశంలో తొలిసారిగా మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్ అయ్యింది. ఆ మ్యాచ్‌లో అజాజ్ పటేల్ 11 వికెట్లతో కివీస్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.