- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్‌కు ఎన్ని అవకాశాలైనా ఇస్తాం: రోహిత్ శర్మ
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీసులో కేఎల్ రాహుల్‌కే తమ మద్దతు ఉంటుందని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఇండోర్ వేదికగా మూడో టెస్టుకు రంగం సిద్ధం అవుతుండగా రోహిత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆటగాడిలో సత్తా ఉంటే దాన్ని నిరూపించుకోవడానికి ఎన్ని అవకాశాలైనా ఇస్తామని చెప్పాడు. అయితే ఈ సిరీస్‌లో చివరి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను సెలెక్టర్లు తొలగించారు.
దీంతో మూడో టెస్టులో అతన్ని ఆడించడం లేదని.. ఫామ్‌లో ఉన్న గిల్‌ను జట్టులోకి తీసుకోవడానికే రాహుల్‌ను ఈ పదవి నుంచి తప్పించారని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. 'ఎవరైనా ఆటగాడు ఫామ్‌లో లేక కష్టాల్లో ఉన్నప్పుడు.. అతనిలో ఉన్న సత్తాను బట్టి అవకాశాలు ఇస్తాం. తమ సత్తా నిరూపించుకునే సమయం వాళ్లకు ఇవ్వాలి' అని రోహిత్ పేర్కొన్నాడు. వైస్ కెప్టెన్ తొలగింపుపై కూడా రోహిత్ స్పందించాడు. వైస్ కెప్టెన్‌గా ఉన్నా, లేకపోయినా ఆటగాడి స్థాయిలో ఎలాంటి మార్పు ఉండదన్నారు.