రోహిత్.. నువ్వు ఆ పని చేస్తేనే ప్రశ్నలు ఆగుతాయి.. హిట్‌మ్యాన్‌కు అశ్విన్ కీలక సూచన

by Harish |
రోహిత్.. నువ్వు ఆ పని చేస్తేనే ప్రశ్నలు ఆగుతాయి.. హిట్‌మ్యాన్‌కు అశ్విన్ కీలక సూచన
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లేమితో తంటాలు పడుతున్నాడు. ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో కూడా రెండు పరుగులే చేసి నిరాశపరిచాడు. దీంతో అతని భవిష్యత్తు ప్లాన్స్‌పై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీనిపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ చానెల్‌లో స్పందించాడు. హిట్‌మ్యాన్‌కు మద్దతుగా నిలుస్తూనే కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రశ్నలు ఆగాలంటే రాణించడం ఒక్కటే మార్గమని సూచించాడు. ‘రోహిత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అలాంటి ప్రశ్నలు అతనికి చిరాకు తెప్పిస్తాయి. సిరీస్‌పై ఫోకస్ పెట్టాలని, మంచి రికార్డు ఉన్న వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన కొనసాగించాలని, టోర్నమెంట్‌‌లో పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని అతను ఆలోచిస్తున్నాడు. కానీ, ప్రజలు ప్రశ్నిస్తారు. అన్ని చూస్తున్న వాళ్లు కచ్చితంగా అడుగుతారు. ఇది తప్పించుకోలేని పరిస్థితి. ప్రశ్నలను ఆపడం కుదరదు. అతను రాణిస్తేనే ప్రశ్నలు ఆగుతాయి. ఓ క్రికెటర్‌గా రోహిత్ ఏం ఆలోచిస్తున్నాడో నాకు అర్థమైంది. అది అంత సులభమైనది కాదు. అతను బాగా ఆడాలని, ఈ సిరీస్‌లో సెంచరీ చేయాలని ప్రార్థిస్తున్నా.’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.


Next Story

Most Viewed