టైటిల్ నిరీక్షణకు సింధు తెరదించేనా?

by Harish |
టైటిల్ నిరీక్షణకు సింధు తెరదించేనా?
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ టైటిల్ గెలిచి రెండేళ్లు దాటిపోయింది. చివరిసారిగా 2022లో సింగపూర్ ఓపెన్ విజేతగా నిలిచింది. అనంతరం గాయాలతో సతమతమైన ఆమె మరో టైటిల్ గెలవలేదు. ఇటీవల ఆమె ఫామ్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నది. గత నెలలో డెన్మార్క్ ఓపెన్‌లో క్వార్టర్స్‌లో వెనుదిరిగింది. నేటి నుంచి జరిగే కుమామోటో జపాన్ మాస్టర్స్‌లో టైటిల్ నిరీక్షణ తెరదించాలని సింధు భావిస్తున్నది.

aఅయితే, తొలి రౌండ్‌లోనే ఆమె కఠిన ప్రత్యర్థిని ఎదుర్కోనుంది. 8వ సీడ్, థాయిలాండ్ ప్లేయర్ బుసనన్ ఒంగ్బమ్రుంగ్ఫాన్‌తో తలపడనుంది. అలాగే, ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ కూడా ఫామ్‌ అందుకోవాలని చూస్తున్నాడు. ఇటీవల ఆర్కిటిక్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్ టోర్నీల్లో ఆరంభ రౌండ్‌లోనే నిష్ర్కమించిన అతను.. తొలి రౌండ్‌లో లియోంగ్ జున్ హో(మలేషియా)తో తలపడటం ద్వారా టోర్నీని మొదలుపెట్టనున్నాడు. అలాగే, మహిళల డబుల్స్ షట్లర్లు ట్రీసా జాలీ, గాయత్రి గోపిచంద్‌ జోడీపై కూడా అంచనాలు ఉన్నాయి. తొలి రౌండ్‌లో గాయత్రి జంట.. చైనీస్ తైపీ ద్వయం హ్సు యిన్ హుయ్, లిన్ జిహ్ యున్‌లతో ఆడనుంది.

Advertisement

Next Story

Most Viewed