Hardik Pandya : పాండ్యాపై మరోసారి కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

by Mahesh |   ( Updated:2023-08-17 07:10:48.0  )
Hardik Pandya : పాండ్యాపై మరోసారి కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మరోసారి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాండ్యా భవిష్యత్తులో చాలా టెస్టులు ఆడతాడని తాను భావించడం లేదని అన్నారు. పాండ్యా టెస్టులకు ఫిట్ గా ఉంటే.. రెడ్ బాల్ క్రికెట్ ఆడటం చూడాలనుకున్న.. కానీ అది జరగడం లేదని ఆయన అన్నారు. కాగా టెస్టు క్రికెట్‌లో పాండ్యా శరీరం టెస్టు భారాన్ని మోయగలదా అనే చర్చ కొంతకాలంగా భారత క్రికెట్‌లో చక్కర్లు కొడుతోంది. 29 ఏళ్ల అతను 2017లో శ్రీలంకలో భారత్ తరఫున రెడ్ బాల్‌తో అరంగేట్రం చేశాడు కానీ 2018లో ఇంగ్లాండ్ పర్యటన తర్వాత టెస్టులు ఆడలేదు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ ప్రకారం, బెన్ స్ట్రోక్స్ లాంటి ఆల్ రౌండర్ భారత్‌కు అవసరమని అన్నారు. ఈ క్రమంలో హర్దిక్ పాండ్యా టెస్ట్ క్రికెట్ పై పలు అనుమానాలు రేకేత్తిస్తున్నాయి.

Next Story