Avesh Khan: 'మీకు ఇతనే దొరికాడా..!' టీమ్​ఇండియా సెలక్షన్ కమిటీపై ఫైర్

by Vinod kumar |   ( Updated:2023-07-06 10:28:20.0  )
Avesh Khan: మీకు ఇతనే దొరికాడా..! టీమ్​ఇండియా సెలక్షన్ కమిటీపై ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కొద్ది రోజుల్లో విండీస్​తో సిరీస్​ సిద్ధం కానున్న నేపథ్యంలో టీమ్​ఇండియా జట్టును ప్రకటించింది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో పోరుకు సిద్ధం కానున్న ఈ జట్టు.. రానున్న మ్యాచ్​ల కోసం ఇప్పటికే తీవ్ర కసరత్తులు చేస్తోంది. అయితే ఈ సిరీస్ కోసం​ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసిన జట్టుపై సర్వత్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఫామ్‌లో లేని ఫాస్ట్‌ బౌలర్‌ ఆవేశ్​ ఖాన్‌ ఎంపిక విషయాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. ఐపీఎల్‌-2023లో అదరగొట్టిన కోల్​కతా టీమ్​ ఆటగాడు రింకూ సింగ్‌ను సెలక్టర్లు పక్కనబెట్టిన విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అయితే అనూహ్యంగా సెలక్టర్లు ఇప్పుడు విండీస్​ పర్యటన కోసం అతడికి పిలుపునివ్వడం వల్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతడి స్ధానంలో ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన తుషార్‌ దేశ్‌ పాండే లేదా ఆకాష్‌ మధ్వాల్‌ లాంటి మేటి ప్లేయర్లకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. 'మీకు ఈ ఓవరాక్షన్‌ స్టారే దొరికాడా' అంటూ సెలక్టర్లు ఉద్దేశించి నెట్టింట అభిమానులు ఫైర్ అవుతున్నారు.

ఐపీఎల్‌-2023లో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన అవేశ్​.. 9.75 ఏకానమితో 9 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు జాతీయ జట్టు తరఫున వచ్చిన అవకాశాలను కూడా అందిపుచ్చుకోలేకపోయాడు. ఈ క్రమంలో గతేడాది భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఆవేశ్​.. పెద్దగా రాణించకపోవడం వల్ల తుది జట్టులో చోటును సంపాదించలేకపోయాడు. దీంతో సుమారు ఏడాది నుంచి అతడు జట్టుకు దూరంగా ఉన్నాడు.

వరల్డ్ కప్​లో అతడిని ఆడించాలి : గంగూలీ ఆసక్తికర వ్యాఖ్య

Advertisement

Next Story

Most Viewed