IND VS SL : శ్రీలంకకు మరో షాక్.. స్టార్ బౌలర్‌ దూరం

by Harish |
IND VS SL : శ్రీలంకకు మరో షాక్.. స్టార్ బౌలర్‌ దూరం
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు శ్రీలంకకు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. ఇప్పటికే పేసర్ దుష్మంత చమీర సిరీస్‌ నుంచి వైదొలగగా.. మరో స్టార్ పేసర్ నువాన్ తుషారా కూడా సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం కారణంగా అతను భారత్‌తో టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదని శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం వెల్లడించింది. అతని స్థానంలో దిల్షాన్ మధుశంకను జట్టులోకి తీసుకున్నట్టు పేర్కొంది.

ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా నువాన్ ఎడమ చేతి వేళ్లకు గాయమైంది. మెడికల్ రిపోర్టులో అతని ఎడమ బొటన వేలు ఫ్రాక్చర్ అయినట్టు తేలింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సిరీస్ మొత్తానికి అతను దూరమయ్యాడు. నువాన్ తుషారా లేకపోవడం శ్రీలంకకు భారీ దెబ్బే. ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో సత్తచాటిన అతను మూడు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. టీ20 సిరీస్‌లో భాగంగా ఈ నెల 27న తొలి మ్యాచ్ జరగనుంది.

Next Story

Most Viewed