- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాంచీ టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. ఆ స్పిన్నర్ మళ్లీ జట్టులోకి
దిశ, స్పోర్ట్స్ : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో మూడు టెస్టులు పూర్తయ్యాయి. ప్రస్తుతం భారత్ 2-1తో ఆధిక్యంలో ఉన్నది. రేపటి నుంచి రాంచీ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో మ్యాచ్‌కు ఒక్క రోజు ముందే ఇంగ్లాండ్ తమ తుది జట్టును ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. నాలుగో టెస్టుకు కూడా అదే ఫాలో అయిన ఇంగ్లాండ్.. రాంచీ మ్యాచ్‌లో బరిలోకి దిగే తమ జట్టును గురువారం వెల్లడించింది.
వరుసగా రెండు ఓటములతో సిరీస్‌లో వెనుకబడిన ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో పుంజుకోవాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో తుది జట్టులో బౌలింగ్ దళంలో రెండు మార్పులు చేసింది. స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌ను పక్కనపెట్టిన ఇంగ్లాండ్.. అతని స్థానంలో షోయబ్ బషీర్‌కు చోటు కల్పించింది. టామ్ హార్ట్లీ తర్వాత ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఇంగ్లాండ్ బౌలర్ అతనే. మూడు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసిన అతన్ని తప్పించడం గమనార్హం. అయితే, జట్టు కూర్పులో భాగంగా రెహాన్ అహ్మద్‌ను పక్కపెట్టిన ఉండొచ్చు. జాక్ లీచ్ దూరమవడంతో రెండో టెస్టుతో షోయబ్ బషీర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్‌లో అతను 4 వికెట్లతో సత్తాచాటాడు కూడా. అయితే, అనూహ్యంగా మూడో టెస్టుకు అతన్ని తప్పించగా.. తాజాగా తిరిగి జట్టులోకి తీసుకున్నారు.అలాగే, జోరూట్ పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా బాధ్యతలు మోయనున్నాడు.
పేసర్ మార్క్‌వుడ్‌ను తప్పించి అతని స్థానంలో మరో పేసర్ ఓలీ రాబిన్సన్‌ను జట్టులోకి తీసుకుంది. రాబిన్సన్ ఈ సిరీస్‌లో ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు. మూడు మ్యాచ్‌లకు అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే, భారత ఏ జట్టుతో అనధికార టెస్టు సిరీస్‌లో పాల్గొన్నాడు. అలాగే, సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ పేస్ దళాన్ని మోయనున్నాడు. గత మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేయని బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్‌లో బంతి అందుకోనున్నట్టు తెలుస్తోంది. ఇక, బ్యాటింగ్ దళంలో ఇంగ్లాండ్ ఏ మార్పులు చేయలేదు.