Rohit Sharma : మా ఆవిడ చూస్తుంది..నేను అది చెప్పలేను : రోహిత్ శర్మ

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-02-04 12:28:45.0  )
Rohit Sharma : మా ఆవిడ చూస్తుంది..నేను అది చెప్పలేను : రోహిత్ శర్మ
X

దిశ, వెబ్ డెస్క్ : బీసీసీఐ నమన్ అవార్డు(BCCI Naman Awards)ల కార్యక్రమంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) చేసిన వ్యాఖ్యలు(Comments)నెట్టింట వైరల్(Viral)గా మారాయి. బీసీసీఐ నమన్ అవార్డుల కార్యక్రమం ముంబయిలో ఘనంగా జరిగింది. భారత స్టార్ క్రికెటర్లందరూ ఒకే చోట కనువిందు చేశారు. సచిన్ తెందూల్కర్ కు జీవితకాల సాఫల్య పురస్కారం వరించింది. ఈ సందర్భంగా భారత మహిళా, పురుష జట్ల క్రికెటర్లు నిర్వహించిన ప్రత్యేక చిట్ చాట్ కార్యక్రమాలు అభిమానులను అలరించాయి.

రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్య, మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ ఓ వేదికపై సందడి చేశారు. ఆ వీడియోలను బీసీసీఐ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. చిట్ చాట్ లో టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మందాన అడిగిన ఓ ప్రశ్న రోహిత్ శర్మ చెప్పిన సమాధానం అందరిని నవ్వుల్లో ముంచెత్తింది. మీకున్న హాబీల్లో దేనినైనా సహచర క్రికెటర్లు ఆటపట్టించారా? అని అడగ్గా దానికి స్పందిస్తూ.. నాకైతే తెలియదు..కానీ మరిచిపోవడం గురించి మాత్రం టీజ్‌ చేస్తుంటారని..అయితే అది నా హాబీ మాత్రం కాదంటూ సమాధానం ఇచ్చి అందరిని నవ్వించారు.

నా వాలెట్, పాస్ పోర్టు మరిచిపోయినట్లు చెబుతుంటారని..అదంతా అవాస్తవమేనని..అదంతా రెండు దశాబ్దాల కిందట జరిగిందని సమాధానం ఇచ్చాడు. అలాగే మీరు ఇప్పటి వరకు ఏదైనా అతిపెద్ద విషయాన్ని మరిచిపోయారా?’’ అని యాంకర్ స్మృతి ప్రశ్నించగా.. నేను ఆ విషయం చెప్పలేనని..ఎందుకంటే ఈ ప్రోగ్రామ్‌ లైవ్‌లో వస్తే మా ఆవిడ చూస్తుందని..కాబట్టి నేను చెప్పనని..దానిని నాతోనే ఉంచుకుంటానని చమత్కరించడంతో కార్యక్రమానికి హాజరైన వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. అయితే, రోహిత్ దాచిపెట్టిన ఆ విషయం ఏంటనే దానిపై చర్చ మొదలైంది. ఓ హోటల్ గదిలో రోహిత్ తన వెడ్డింగ్ రింగ్ ను మరిచిపోయిన ఘటనను ఫ్యాన్స్ గుర్తు చేశారు. 2015లో రితికాతో రోహిత్ వివాహం జరిగింది.

ఆవార్డుల కార్యక్రమంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ భారత క్రికెట్ కు సేవలు అందించిన గొప్ప ఆటగాళ్లను కలవడం ఆనందంగా ఉందన్నారు. గతంలో హైదరాబాద్ లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించినట్లు గుర్తుందని.. ఇప్పుడు ముంబయిలో నిర్వహించడం అభినందనీయమని వ్యాఖ్యానించారు. అయితే రంజీ ట్రోఫీలో భాగంగా రైల్వేస్ తో ఢిల్లీ జట్టు తరుపున ఆడటంతో విరాట్ కోహ్లి(Virat Kohli) ఈ అవార్డుల కార్యక్రమానికి రాలేకపోయారు.


Next Story

Most Viewed