నా చిన్ననాటి కల నిజమైన రోజు.. సచిన్ ఎమోషనల్ ట్వీట్

by Sathputhe Rajesh |   ( Updated:2024-04-02 12:39:08.0  )
నా చిన్ననాటి కల నిజమైన రోజు.. సచిన్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: 2011 ఏప్రిల్ 2 భారత క్రికెట్ చరిత్రలో ఓ మరుపురాని రోజు. భారత క్రికెట్ జట్టు రెండో సారి వన్డే వరల్డ్ కప్‌ను ఒడిసి పట్టుకుని 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. 1983 తర్వాత ధోని సారథ్యంలో భారత జట్టు వన్డే వరల్డ్ కప్‌లో విజయం సాధించి కొత్త చరిత్ర లిఖించింది. పాకిస్తాన్ లో సెమీ ఫైనల్ లో గెలిచిన భారత్, ఫైనల్ లో శ్రీలంకపై గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. భారత క్రికెట్ అభిమానులకు ఫైనల్ మ్యాచ్‌లో ధోని కొట్టిన సిక్స్ ఇప్పటికి కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. అయితే ఈ స్పెషల్ డే సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓ స్పెషల్ ట్వీట్ చేశారు. ‘పదేమూడేళ్ల క్రితం.. నా చిన్ననాటి కల నిజమైన రోజు. ఆ జట్టు.. కోట్లాది మంది దేశ ప్రజల మద్దతు ఎప్పటికి ఓ మధురానుభూతిగా గుర్తుంటుంది.’ అని సచిన్ ట్వీట్ చేశాడు.

Advertisement

Next Story

Most Viewed