Mohammed Shami : రెండో పెళ్లి చేసుకోబోతున్న షమీ.. వైరల్ అవుతున్న ఫోటో

by Prasanna |   ( Updated:2024-01-20 12:48:50.0  )
Mohammed Shami : రెండో పెళ్లి చేసుకోబోతున్న షమీ.. వైరల్ అవుతున్న ఫోటో
X

దిశ,ఫీచర్స్: ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఇతని పేరు మారుమ్రోగింది. ఎందుకంటే తన బాల్ తో బ్యాట్స్ మెన్ కి చెమటలు పట్టించగల సత్తా ఒక్క షమికే ఉంది. ICC ప్రపంచ కప్ 2023లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మహ్మద్ షమీ రికార్డు కొత్త సృష్టించాడు. ఈ పెర్ఫార్మెన్స్ కి భారత ప్రభుత్వం ఇటీవల అర్జున అవార్డును కూడా అందజేసింది.

కాసేపు, ఆట పక్కన పెడితే షమీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. తన భార్యతో మనస్పర్థలు, విడాకులు, గొడవల వంటి అంశాలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. మొదటి భార్య నిత్యం షమీని ట్రోల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా షమీ రెండు ఫోటోలను అప్‌లోడ్ చేశాడు. "నా స్నేహితులందరికీ ధన్యవాదాలు.. మీరు నన్ను చాలా స్వాగతించేలా చేస్తున్నారు." అంటూ రాసుకొచ్చాడు. అయితే, ఈ ఫొటోలో పెళ్లికొడుకు గెటప్ లో ముస్తాబై , తలపాగా ధరించి మెడలో దండతో ఉన్న ఫొటోలను షమీ తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేశాడు. నిమిషాల్లోనే ట్రెండ్ అయ్యాయి. దాంతో క్రికెటర్‌ని కొత్త గెటప్‌లో చూసి అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొందరు అభిమానులైతే షమీ రెండో పెళ్లి చేసుకున్నాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story