కేకేఆర్ ఆటగాళ్లకు మెసేజ్ పంపిన గంభీర్.. అలా చేయడానికి కాదని వార్నింగ్

by Harish |
కేకేఆర్ ఆటగాళ్లకు మెసేజ్ పంపిన గంభీర్.. అలా చేయడానికి కాదని వార్నింగ్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024 ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ తన జట్టు ఆటగాళ్లకు గట్టి సందేశం ఇచ్చాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో గంభీర్ మాట్లాడుతూ.. ఐపీఎల్ అంటే బాలీవుడ్, పార్టీలు చేసుకోవడం కాదన్నాడు. ‘నా వరకు మొదటి రోజు నుంచి ఐపీఎల్‌ సీరియస్ క్రికెటే. బాలీవుడ్ గురించో, పార్టీలు చేసుకోవడం గురించో కాదు. ఇది మైదానంలో పోటీ క్రికెట్ ఆడటం గురించి. ఎందుకంటే, ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లీగ్‌గా నేను భావిస్తున్నా. ఇక్కడ సరైన క్రికెట్ ఆడతారు. ఇతర లీగ్‌లతోపాటు ఐపీఎల్ అంతర్జాతీయ క్రికెట్‌కు దగ్గరగా ఉంటుంది. కోల్‌కతాకు చాలా మంది క్రికెట్‌పై మక్కువ ఉన్న అభిమానులు ఉన్నారు. వారిని సంతోష పెట్టడానికి ఈ సారి ప్రయత్నిస్తాం.’ అని గంభీర్‌ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ నెల 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కేకేఆర్ తొలి మ్యాచ్ ఆడనుంది.

Advertisement

Next Story