గంభీర్‌-శ్రీశాంత్‌ ఘటనపై స్పందించిన ఎల్‌ఎల్‌సీ ఎథిక్స్‌ కమిటీ చీఫ్‌..

by Vinod kumar |
గంభీర్‌-శ్రీశాంత్‌ ఘటనపై స్పందించిన ఎల్‌ఎల్‌సీ ఎథిక్స్‌ కమిటీ చీఫ్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: గంభీర్‌-శ్రీశాంత్‌ ఘటనపై ఎల్‌ఎల్‌సీ ఎథిక్స్‌ కమిటీ హెడ్‌ సయీద్‌ కిర్మాణీ స్పందించారు. దీనిపై అంతర్గత విచారణ నిర్వహిస్తామని, తమతో కాంట్రాక్టు కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని తెలిపారు. డిసెంబర్‌ 6న గుజరాత్‌ జెయింట్స్‌, ఇండియన్‌ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గంభీర్‌ తనను ‘ఫిక్సర్‌’ అని అన్నాడని శ్రీశాంత్‌ ఆరోపించిన విషయం తెలిసిందే.

తాజాగా ఇదే విషయమై కిర్మాణీ స్పందిస్తూ.. ‘లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ క్రికెట్‌లో క్రీడా స్ఫూర్తిని నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఘటనపై ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద అంతర్గత విచారణ చేపడతాం. ఆన్‌ ఫీల్డ్‌లో గానీ సోషల్‌ మీడియాలో గానీ ఆటగాళ్ల దుష్ఫ్రవర్తనపై కఠినంగా వ్యవహరిస్తాం’ అని అన్నారు. ఎల్‌ఎల్‌సీ సీఈవో ఆఫ్‌ క్రికెట్‌ రాహన్‌ రహేజా స్పందిస్తూ.. ‘ఎల్‌ఎల్‌సీతో ఒప్పందం కుదుర్చుకున్న క్రికెటర్లందరూ నిబంధనలకు లోబడి ఉండాలి. నిబంధలను అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు..’ అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed