WTC Final ఫైనల్ ఆడే జట్టు ఇదే.. సునీల్ గవాస్కర్

by Vinod kumar |
WTC Final ఫైనల్ ఆడే జట్టు ఇదే.. సునీల్ గవాస్కర్
X

దిశ, వెబ్‌డెస్క్: సరైన జట్టును ఎంపిక చేస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ టీమ్ ఇండియా గెలవడం ఖాయమని పలువురు మాజీ క్రికెటర్స్ అంటున్నారు. ఈ క్రమంలో జట్టు ఎంపికలో భారత్ ముందు ఒకే ఒక సవాల్ ఉందని గవాస్కర్ చెప్పాడు. 'నేను ముందు బ్యాటింగ్ గురించి మాట్లాడతా. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌ను తీసుకుంటా.. మూడో స్థానంలో ఛటేశ్వర్ పుజారా, నాలుగులో విరాట్ కోహ్లీ. ఇక ఐదో ప్లేస్‌లో అజింక్య రహానే కన్ఫర్మ్. అయితే ఆరో స్థానంలో ఎవరు వస్తారనేదే సమస్యగా ఉంది' అని గవాస్కర్ వివరించాడు. వికెట్ కీపర్లలో ఇషాన్ కిషన్ కన్నా కూడా శ్రీకర్ భరత్‌కే ఆడే అవకాశం ఎక్కువగా ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 'నాకు తెలిసి ఆరో స్థానంలో భరత్ లేదా కిషన్ ఆడతారు. ఇప్పటి వరకు ఆడుతూ వస్తున్నాడు కాబట్టి భరత్‌కే ఈ అవకాశం దక్కొచ్చు. కాబట్టి ఆరో స్థానంలో భరత్‌ వస్తాడు' అని చెప్పాడు.

'ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దర్నీ టీం మేనేజ్‌మెంట్ ఆడిస్తుందని అనుకుంటున్నా. కాబట్టి ఏడో స్థానంలో జడేజా, ఎనిమిదిలో అశ్విన్ ఉంటారు. చివర్లో వరుసగా మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ కన్ఫర్మ్. ఇక ఉమేష్ కన్నా నా ఓటు శార్దూల్‌కే వేస్తా' అని చెప్పాడు. ఇదే తను సెలెక్ట్ చేసే జట్టు అని చెప్పాడు.

గవాస్కర్ WTC Final ప్లేయింగ్ XI:

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్

Advertisement

Next Story